బిజినెస్

గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన హెచ్‌డిఎఫ్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు గృహ, కార్పొరేట్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో మంగళవారం దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ప్రభుత్వరంగ బ్యాంకులైన కార్పొరేషన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను దించాయ. సోమవారం ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐతోపాటు మరో రెండు ప్రైవేట్ బ్యాంకులైన కొటక్ మహీంద్ర, బంధన్ బ్యాంకులు వడ్డీరేట్లను దించినది తెలిసిందే. అంతకుముందు ఆదివారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)తోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ)లు బేస్ రేటును 0.90 శాతం వరకు తగ్గించాయ. ప్రభుత్వరంగానికే చెందిన దేనా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కూడా బేస్ రేట్లను తగ్గించగా, హెచ్‌డిఎఫ్‌సి తాజాగా తమ బేస్ రేటును 0.45 శాతం వరకు కోసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గృహ, కార్పొరేట్ రుణాలు మరింత చౌక అయ్యాయి. కాగా, ఐసిఐసిఐ బ్యాంక్ తమ బేస్ రేటును 0.70 శాతం తగ్గించగా, దేనా బ్యాంక్ 0.75 శాతం తగ్గించింది. కొటక్ మహీంద్ర 0.45 శాతం మేర దించితే, కొత్తగా వచ్చిన బంధన్ బ్యాంక్ ఏకంగా 1.48 శాతం తగ్గించడం గమనార్హం. తొలుత ఎస్‌బిఐ తమ బేస్ రేటును 0.90 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత పిఎన్‌బి 0.70 శాతం, యుబిఐ 0.65 శాతం నుంచి 0.90 శాతం మేర తమ బేస్ రేటును తగ్గిస్తున్నట్లు తెలిపాయ. 75 లక్షల రూపాయల వరకు రుణంపై 8.7 శాతం వార్షిక వడ్డీరేటు, ఆపై రుణాలకు 8.75 శాతం వార్షిక వడ్డీరేటును వసూలు చేస్తామని హెచ్‌డిఎఫ్‌సి స్పష్టం చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేటు 0.90 శాతం తగ్గితే, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 0.80 శాతం, కార్పొరేషన్ బ్యాంక్ 0.70 శాతం మేర తమ వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గృహ, కార్పొరేట్ రుణాలకు చేయూతనిస్తూ శనివారం రాయితీలను ప్రకటించినది తెలిసిందే. దీంతో ఆదివారం నుంచి బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. బ్యాంకులు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, వినియోగ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పారిశ్రామిక రంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. సిఐఐ, ఫిక్కీలు హర్షం వ్యక్తం చేశాయ. పాత పెద్ద నోట్ల రద్దుతో పడిపోయన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీలు పుంజుకుం టాయని, మళ్లీ పరిశ్రమకు నిధులు సమకూరుతాయని పేర్కొన్నాయ. మరిన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలన్నాయ.