బిజినెస్

చిన్న పరిశ్రమలతో నిరుద్యోగ నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 16: దేశంలో నిరుద్యోగ నిర్మూలన రూపుమాపాలంటే గ్రామ, పట్టణాల్లో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. శనివారం నెల్లూరులోని విపిఆర్ కన్వన్షన్ హాల్‌లో స్వర్ణ్భారత్ ట్రస్ట్ సౌజన్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 80 శాతం పెట్టుబడులు పెద్ద పరిశ్రమల్లోనే ఉన్నాయని, అయతే వాటి ద్వారా 20 శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. దేశ జిడిపి వృద్ధిలో 8 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎం) పరిశ్రమలు, సంస్థల ద్వారానే ఉందన్నారు. చిన్నతరహా పరిశ్రమలు గ్రామాలు, పట్టణాలలో స్థాపించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని, దీనికోసం రుణాలు పొందేందుకు బ్యాంకుల నుంచి సమస్యలు ఎదురైతే వాటిని కేంద్ర ప్రభుత్వం పరిష్కారిస్తుందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంక్‌కు తనఖా లేకుండా కోటి రూపాయలు రుణం పొందే అవకాశం ఉందన్నారు. దేశంలో 130 భారీ సంస్థలు పనిచేస్తున్నాయని, ఇవి చిన్న, మధ్యతరహా సంస్థల నుంచే ఆయా పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వమే హామీ ఇస్తుందన్నారు. కాగా, పారిశ్రామిక రంగంలో నెల్లూరు జిల్లాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నెల్లూరులో స్థలం చూపిస్తే స్వర్ణకారులకు శిక్షణ సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది 3 కోట్ల 25 లక్షల మందికి లక్ష కోట్ల రూపాయల వరకు ముద్ర యోజన రుణాలు పంపిణీ చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు 99 శాతం వరకు తిరిగి చెల్లింపులు జరుగుతున్నాయని, ఇది ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు. 2020 సంవత్సరానికల్లా అందరికి ఇళ్లు ఏర్పాటు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్న వెంకయ్య.. నెల్లూరులో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశంలో జిఎస్‌టీ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల దేశంలో జీడిపి రేటు పెరుగుతుందన్నారు.
అంతకుముందు స్వర్ణ్భారత్ ట్రస్టు ఆవరణలో కంటి, పంటి శిక్షణా కేంద్రాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం వేలాది రూపాయలు ఖర్చు పెడుతోందన్నారు.

chitram సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్