బిజినెస్

మదర్సన్ సుమి చేతికి పికెసి గ్రూప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: దేశీయ అతిపెద్ద ఆటో కంపోనెంట్స్ తయారీదారైన మదర్సన్ సుమి సిస్టమ్ లిమిటెడ్.. ఫిన్లాండ్‌కు చెందిన ట్రక్ వైర్ హార్నెస్ తయారీదారైన పికెసి గ్రూప్‌ను సొంతం చేసుకోనుంది. 571 మిలియన్ యూరోల (్భరత కరెన్సీ ప్రకారం 4,146 కోట్ల రూపాయలు)తో పికెసి గ్రూప్‌ను మదర్సన్ సుమి కొనుగోలు చేయనుండగా, ఒక్కో షేర్‌కు 23.55 యూరోలను ఆఫర్ చేస్తోంది. ఇక ఈ కొనుగోలుతో అంతర్జాతీయ స్థాయిలో మదర్సన్ సుమి వ్యాపార కార్యకలాపాలు విస్తరించినట్లు కానుంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ మార్కెట్లలో బలం పెరగనుంది. కాగా, ఈ ఏడాది మార్చికల్లా ఈ లావాదేవీ ముగుస్తుందని ఆశిస్తున్నట్లు మదర్సన్ సుమి ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపింది. మరోవైపు ఈ లావాదేవీకి తమ బోర్డు సభ్యులు మద్దతునిస్తున్నారని పికెసి గ్రూప్ మరో ప్రకటనలో చెప్పింది.