బిజినెస్

సహకార బ్యాంకులకు లేని అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: పిఎమ్‌జికెవై క్రింద డిపాజిట్లను స్వీకరించే అవకాశాన్ని సహకార బ్యాంకులకు ఇవ్వడం లేదు కేంద్రం. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ దర్యాప్తుల్లో తేలడమే కారణం. 50 శాతం పన్నుగా చెల్లించి, 50 శాతాన్ని నాలుగేళ్లపాటు వడ్డీ లేకుండా డిపాజిట్ చేయాలనే నిబంధనతో లెక్కల్లోకి రాని సొమ్మును స్వచ్చంధంగా బ్యాంకుల్లో జమ చేయవచ్చంటూ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పిఎమ్‌జికెవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చినది తెలిసిందే. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది.