బిజినెస్

వర్షసూచన తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో పరుగులు పెట్టాయి. ట్రేడింగ్ జరిగింది మూడు రోజులే అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 952.91 పాయింట్లు పుంజుకుంది. ఫలితంగా తిరిగి 25 వేల స్థాయికి చేరుకున్న సూచీ.. 25,626.75 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 295.25 పాయింట్లు ఎగిసింది. 7,800 మార్కును అధిగమించి 7,850.45 వద్ద నిలిచింది. నిజానికి అంతకుముందు రెండు వారాల్లో మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి. సెనె్సక్స్ ఈ రెండు వారాల్లో 663.72 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 161.30 పాయింట్లు దిగజారింది. అయితే ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయన్న అంచనాలు మదుపరులను పెట్టుబడుల వైపునకు మళ్లించాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాలు కూడా కలిసొచ్చాయి. దీంతో గడచిన వారం సూచీలు భారీ లాభాలను అందుకోగలిగాయి. ఆటో, బ్యాంకింగ్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, పిఎస్‌యు, టెక్నాలజీ, ఐటి, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 8,967.91 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ 50,353.08 కోట్ల రూపాయలుగా ఉంది.