బిజినెస్

డిమానిటైజేషన్‌లోనూ హెచ్‌యుఎల్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 1,037.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 971.66 కోట్ల రూపాయలుగా నమోదవగా, ఈసారి 6.82 శాతం పెరిగినట్లైంది. అయితే ఆదాయం మాత్రం 0.79 శాతం పడిపోగా, ఈసారి 8,317.94 కోట్ల రూపాయలుగా, నిరుడు 8,384.68 కోట్ల రూపాయలుగా ఉంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయం కాస్త తగ్గిపోయిందని, అయినప్పటికీ అమ్మకాలు పెద్దగా పడిపోలేదని హెచ్‌యుఎల్ చైర్మన్ హరీశ్ మన్వానీ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, హోమ్ సెగ్మెంట్ నుంచి సంస్థ ఆదాయం 1.02 శాతం వృద్ధి చెంది 2,689.06 కోట్ల రూపాయలుగా, పర్సనల్ ప్రోడక్ట్స్ నుంచి ఆదాయం 2.69 శాతం దిగజారి 3,980.17 కోట్ల రూపాయలుగా ఉంది. రిఫ్రెష్‌మెంట్ సెగ్మెంట్ ఆదాయం 0.46 శాతం పెరిగి 278.5 కోట్ల రూపాయలుగా, ఆహారోత్పత్తుల విభాగం ఆదాయం 8.14 శాతం ఎగబాకి 1,164.12 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఎగుమతులు, త్రాగునీరు, శిశు సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ఈసారి గతంతో పోల్చితే 27.33 శాతం క్షీణించింది. 195.4 కోట్ల రూపాయలుగానే నమోదైంది. కాగా, దేవ్ బాజ్‌పాయ్‌ని సంస్థ బోర్డులోకి డైరెక్టర్‌గా హెచ్‌యుఎల్ తీసుకుంది. 2010 మేలో సంస్థ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శి, లీగల్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాజ్‌పాయ్ నియమితులయ్యారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో హెచ్‌యుఎల్ షేర్ విలువ 0.25 శాతం పెరిగి 863.25 రూపాయల వద్ద స్థిరపడింది.