బిజినెస్

రెండు నెలల గరిష్ఠానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 2 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 258.24 పాయింట్లు ఎగిసి 27,375.58 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 84.30 పాయింట్లు ఎగబాకి 8,400 స్థాయిని అధిగమిస్తూ 8,475.80 వద్ద స్థిరపడింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఆర్థిక ఫలితాలు మదుపరులను ఆకట్టుకోవడంతో సూచీలు లాభాల దిశగా పయనించాయి. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై నెలకొన్న సానుకూల అంచనాలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని నిపుణులు విశే్లషిస్తున్నారు. మెటల్, ఆటో, పవర్, చమురు, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు, బ్యాంకింగ్ రంగాల షేర్లు లాభాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లో, జపాన్ సూచీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లో కదలాడాయి.