బిజినెస్

పన్ను వసూళ్ల లక్ష్యాలను సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 26: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్ధిక సంవత్సరం కస్టమ్స్ పన్ను వసూళ్ళ ద్వారా రూ.3332 కోట్ల రెవిన్యూ లక్ష్యాలను సాధించాలని ఏపి కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ పిలుపునిచ్చారు. లక్ష్యాలను అధిగమించడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. విజయవాడలోని ఏపి కస్టమ్స్ కార్యాలయంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతయ పతకాన్ని ఆయన ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అధికారులు, సిబ్బందినుద్ధేశించి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధికి కస్టమ్స్ ఉద్యోగులు ఆయువుపట్టు అన్నారు. కస్టమ్స్ ఉద్యోగుల పనితీరుతోనే దేశంలోని కస్టమ్స్ కార్యాలయాలన్నింటిలోనూ ఏపి కస్టమ్స్ శాఖ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉద్యోగులు అందిస్తున్న సేవలతోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ సర్ట్ఫికెట్ లభించడం గర్వకారణమన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు కమిషనర్ పురస్కారాలు అందచేశారు. ఉత్తమ ఉద్యోగులుగా వివిధ కేడర్‌లో కె నాగలింగశాస్ర్తీ, జి ప్రసాద్, సిహెచ్ రామసుబ్బారావు, మురళీకృష్ణ, శివరామ్, బివి వీరభద్రరావు, కె యుగంధర్, పిఎల్ రాజేష్, కె శ్రీనివాసరావులు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తొలుత కమిషనర్ ఉద్యోగుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్లు గుమ్మడి సీతారామయ్య చౌదరి, కెపి సాగర్, పివి సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, సామ్రాజ్యం, రామలక్ష్మీ, శ్రీనివాసచౌదరి తదితరులు పాల్గొన్నారు.