బిజినెస్

వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: వచ్చే వేసవిలో తెలంగాణలో 11000 మెగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడినా తట్టుకునే శక్తి రాష్ట్ర విద్యుత్ శాఖకు ఉందని, విద్యుత్ కోతలకు తావులేకుండా పటిష్టమైన ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. రాష్ట్రం ఏర్పడి 26 నెలలు గడచినా, విద్యుత్ కోతలు లేకుండా రెప్పపాటు కరెంటు పోకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురువారం ఇక్కడ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ సౌధలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజి-2 600 మెగావాట్లు, లోయర్ జూరాల జల విద్యుత్ ప్రాజెక్టు 240 మెగావాట్లు, పులచింతల మొదటి దశ 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. కెటిపిఎస్ ఏడవ స్టేజి 800 మెగావాట్ల విద్యుత్ పనులు త్వరితగతిన కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పం పట్ల దేశ వ్యాప్తంగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఇహెచ్‌వి సబ్ స్టేషన్లు 49, 2151 సర్క్యూట్ కిలవో మీటర్ల పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు 3.12 శాతానికి తగ్గిందన్నారు.
రూ.704 కోట్లతో 9 గంటల విద్యుత్
రాష్ట్రప్రభుత్వం రూ.704 కోట్ల ఖర్చుతో 378 అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, 318 పిటిఆర్ స్ధాయి పెంపు, 1805 నూతన లైన్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేసి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని తెలంగాణ సదరన్ పవర్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి అన్నారు. గ్రామాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్ధ పటిష్టం చేశామన్నారు. ప్రమాద రహిత వ్యవస్ధ రూపొందించడం కోసం వంద రోజుల్లో సర్వేను పూర్తి చేస్తామన్నారు.