బిజినెస్

కాస్త మెరుగ్గా ఉన్నామంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తరచూ భారత్‌ను ఓ వెలుగు రేఖగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈ అభిప్రాయాలను ‘గుడ్డివాళ్ల రాజ్యానికి ఒంటి కన్ను రాజు’ చందంగా పేర్కొన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్. ఏదీ దొరకని చోట దొరికినదే మహా ప్రసాదం అన్న ధోరణిలో స్పందించారు రాజన్. నేటి అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూల పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థను ఐఎమ్‌ఎఫ్ తదితర ప్రపంచ స్థాయి ఏజెన్సీలు వెలుగు రేఖగా చెబుతున్నది తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం పడకుండా ఆర్‌బిఐ గవర్నర్ రాజన్ తీసుకున్న చర్యలూ దీనికి ఓ కారణమే. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సమావేశాల కోసం వాషింగ్టన్ పర్యటనలో ఉన్న రాజన్.. ఇక్కడ జి20 దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలో ది వాల్‌స్ట్రీట్ డిజిటల్ నెట్‌వర్క్‌లో భాగమైన డోజోన్స్ అండ్‌కో ప్రచురిస్తున్న మార్కెట్ వాచ్‌కు రాజన్ ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘వెలుగు రేఖ’పై అడిగినదానికి స్పందిస్తూ ‘సంతృప్తి చెందే స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ లేదు. అయితే ఇప్పుడున్న దేశాల్లో కాస్త మెరుగ్గా ఉందని అనుకుంటున్నాను.’ అన్నారు. ఈ క్రమంలోనే ‘గుడ్డివాళ్ల రాజ్యానికి ఒక కన్నున్నవాడు రాజు’ అన్న మాదిరిగా భారత్ ఉందని, మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని, అందుకే అందరూ భారత్‌ను వెలుగు రేఖగా అభివర్ణిస్తున్నారంతే అన్నారు ఐఎమ్‌ఎఫ్ మాజీ ముఖ్య ఆర్థికవేత్తగా కూడా పనిచేసిన రఘురామ్ రాజన్.

ఐఎమ్‌ఎఫ్ చీఫ్ అవకాశం
అభివృద్ధి చెందుతున్న దేశాలకివ్వాలి
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్)కి తర్వాతి చీఫ్‌గా అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యక్తులకే అవకాశం ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసింది. ఐఎమ్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టిన్ లగార్డేకే మళ్లీ ఐదేళ్లపాటు అవకాశం ఇచ్చినది తెలిసిందే. అయితే ఈ పదవికి ఎవరూ పోటీపడకపోవడంతో లగార్డే అభ్యర్థిత్వానే్న బలపరిచిన భారత్.. వచ్చేసారి మాత్రం ఐరోపాయేతర దేశాలకు అవకాశం ఇవ్వాలంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిజానికి ఇప్పటిదాకా ఐరోపాయేతర వ్యక్తులకు ఈ అవకాశం దక్కిన దాఖలాలు లేవన్నారు.

chitram వాషింగ్టన్‌లో అరుణ్ జైట్లీతో రాజన్