బిజినెస్

విశాఖ భాగస్వామ్య సదస్సులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక సంస్కరణలు భేష్
పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి భారత ప్రభుత్వంతోపాటు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా నడుంబిగించడం శుభసూచకం. భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్రం చేపట్టిన సంస్కరణలు ఆహ్వానించదగినవిగా ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటును వేగవంతం చేశారు. త్వరలోనే వీటి ఫలాలను మనం చూగడలుగుతాం. ఏపిలో మా గ్రూప్ వ్యాపారాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో ఏపితో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
- కుమార మంగళం బిర్లా
చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్

చంద్రబాబు విజన్
అభినందనీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ అభినందనీయం. వృద్ధిరేటు పెరగడానికి ఈ విజన్ కారణం. అపారమైన కోస్ట్‌లైన్, పరిశ్రమలకు సరిపడినంతగా నాణ్యమైన విద్యుత్, వౌలిక సదపాయాలు ఏపిని దేశంలోనే ముందువరసలో నిలబెట్టడానికి సహకరిస్తాయి. ఇక్కడ తయారీ రంగం అభివృద్ధి చెందడానికి బోలెడంత ఆస్కారం ఉంది.
- బాబా కళ్యాణి
సిఎండి, భారత్ ఫోర్జ్ లిమిటెడ్

నాణ్యమైన ఉద్యోగాలు
దొరకడం లేదు!
గడచిన 25 ఏళ్లలో దేశంలో భారీ ఎత్తున ఉద్యోగావకాశాలొచ్చాయ. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయి. అయితే ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో యాజమాన్యాలు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, నాణ్యమైన ఉద్యోగాలు కూడా సమకూర్చవలసిన బాధ్యత పెట్టుబడిదారులపై ఉంది. ఇక ఎకనామిక్ పెర్ఫార్మెన్స్‌లో ప్రపంచ దేశాల్లో భారత్ మొదటి 10 స్థానాల్లో ఉంది. అయతే త్వరలోనే మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయి. వచ్చే 25 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది. వౌలిక సదుపాయాల రంగం లో పిపిపి విధానంలో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దేశీయ పెట్టుబడిదారులు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పారిశ్రామిక ప్రగతికి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. ముఖ్యంగా పర్యావరణ సమతౌల్యత ఆందోళనకరంగా మారింది. అనుమతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొరత పెరిగింది. కొన్ని పవర్ ప్రాజెక్టులు వివాదాల్లో ఉండడంతో ఈ సమస్య తలెత్తుతోంది. వీటన్నింటిని వీలైనంత త్వరగా అధిగమిస్తే, దేశంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తుంది.
- నౌషద్ ఫోబ్స్
అధ్యక్షుడు, సిఐఐ
కో-చైర్మన్ ఫోబ్స్ మార్షల్

విదేశీ పారిశ్రామిక
మంత్రులేమన్నారంటే...
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల (యుఎఇ) మధ్య స్నేహ సంబంధాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో కూడా ఇరు దేశాలు కొత్త అధ్యాయానికి తెరతీయనున్నాయి. యుఎఇ ఆర్థిక వ్యవస్థ చాలా సరళంగా ఉంటుంది. వృద్ధిరేటు విషయంలో భారత్ తీసుకుంటున్న చోరవను మా దేశం స్ఫూర్తిగా తీసుకుంటోంది. ఆర్థిక వృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. 25 ఏళ్ల కిందట పశ్చిమ దేశాలతో కేవలం ఆరు శాతం మాత్రమే వాణిజ్యం సాగించేవాళ్లం. ఇప్పుడు 60 శాతం వ్యాపారాలు తూర్పు దేశాలతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశలతో ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యుఎఇ ఆసక్తి చూపుతోంది. ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిన చైనా, భారత్ విజయ గాథలను మేము ఎప్పటికప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. భారతీయులు క్రియేటివిటీకి పెట్టింది పేరు. వీరి సేవలను తాము వినియోగించుకుంటాం.
- సుల్తాన్ బిన్ సరుూద్ ఆల్‌మన్సూరీ
యుఎఇ ఆర్థిక మంత్రి

ఆర్థిక ప్రగతిలో
భారత్ స్ఫూర్తిదాయకం
బంగ్లాదేశ్ ఆర్థిక ఇబ్బందులతో ఎదురీదుతూ ముందుకు నడుస్తోంది. అయన ప్పటికీ నిరుడు ఆరు శాతం ఉన్న వృద్ధిరేటు, ఈ ఏడాది ఏడు శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల వరకూ ఉన్నాయి. వీటిని వచ్చే రెండేళ్లలో 50 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. 2030 నాటికి బంగ్లాదేశ్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థను సాధించగలుగుతుంది. ఆర్థికాభివృద్ధికి భారత్ చేపట్టిన చర్యలు తమ వంటి దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
- టోఫిల్ అహ్మద్
బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రి

అన్నింటా భారత్‌నే
అనుసరిస్తున్నాం!
భారత సంస్కృతి, సంప్రదాయాలు, సాంకేతికతను ఇప్పటికీ నేపాల్ అన్వయించుకుంటూ వెళ్తోంది. నేపాల్, భారత్‌ల మధ్య స్నేహ సంబంధాలు ఈనాటివి కావు. నేపాల్ వాణిజ్య విపణిలో 65 శాతం భారత్ ఉత్పత్తులే ఉన్నాయంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నేపాల్ ఆర్థికాభివృద్ధి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. నేపాల్‌లో ఔషధ మొక్కలు విశేషంగా ఉన్నాయి. వీటిని మార్కెట్ చేయడానికి పారిశ్రామిక సంస్థలు ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- రోమి గుచన్ తక్లీ
నేపాల్ వాణిజ్య మంత్రి

చిత్రం..సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు