బిజినెస్

‘సిగరెట్ పొగ’ తగ్గింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: బహుళ వ్యాపార సంస్థ ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,646.73 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 5.71 శాతం అధికం. నాడు సంస్థ లాభం 2,503.76 కోట్ల రూపాయలు. ఆదాయం కూడా 4.69 శాతం పెరిగి 13,569.97 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 12,961.85 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఐటిసి తెలిపింది. కాగా, ఐటిసికి ప్రధానమైన ఎఫ్‌ఎమ్‌సిజి వ్యాపారం నుంచి ఈసారి వచ్చిన ఆదాయం 10,857.23 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో సిగరెట్ల అమ్మకాల ద్వారా వచ్చినది 8,287.97 కోట్ల రూపాయలు. అయితే పోయినసారి ఎఫ్‌ఎమ్‌సిజి ఆదాయం 10,591.22 కోట్ల రూపాయలుగా నమోదైంది. సిగరెట్ల ఆదాయం 8,106.31 కోట్ల రూపాయలుగా ఉంది. హోటళ్ల వ్యాపారం నుంచి 370.51 కోట్ల రూపాయలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల విక్రయాల ద్వారా 1,671.92 కోట్ల రూపాయలు, పేపర్ బోర్డ్స్, పేపర్ అండ్ ప్యాకేజింగ్ వ్యాపారం నుంచి 1,335.82 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఐటిసి అందుకుంది. ఇదిలావుంటే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ), జీవితకాల డైరెక్టర్‌గా పూరి నియమితులైయ్యారు. వచ్చే నెల 5 నుంచి సిఇఒ బాధ్యతలు అమల్లోకి వస్తాయని ఐటిసి ప్రత్యేకంగా ఓ ప్రకటనలో తెలియజేసింది. అలాగే ఇదే తేదీ నుంచి సంస్థకు మెంటర్‌గా వైసి దేవేశ్వర్ వ్యవహరిస్తారని పేర్కొంది.