బిజినెస్

డీజిల్ వాహనాలపై నిషేధం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నూతన డీజిల్ ఎస్‌యువిలపై, 2,000 సిసికిపైగా ఇంజిన్లను కలిగిన కార్లపై ఢిల్లీలో తాత్కాలిక నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆటోరంగ సంస్థలు వ్యాఖ్యానించాయి.
దేశ రాజధానిలో పర్యవరణ పరిరక్షణకు అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎలాంటి పురోగతి ఉండదని అభిప్రాయపడ్డాయి. కాలుష్యం పెరగడానికి ఎన్నో కారణాలున్నాయని మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర, టొయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు.
భారతీయ ఆటోరంగ తయారీ సమాజం సియామ్ సైతం సుప్రీం నిర్ణయం దురదృష్టకరమంది. ఆటో సంస్థల అమ్మాలపై ప్రభావం చూపుతుందంది.

లాభాలపై చెన్నై వరదల ప్రభావం: విప్రో
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: చెన్నై వరదల ప్రభావం ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఉండొచ్చని దేశీయ ఐటిరంగ మూడో అతిపెద్ద సంస్థ విప్రో అంటోంది. ‘్భరీ వర్షాలతో మునుపెన్నడూ లేనివిధంగా చెన్నైలో సంభవించిన వరద బీభత్సం విప్రో కార్యకలాపాలపై ప్రభావం చూపింది. దీనివల్ల ఈ డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ లాభం తగ్గేవీలుందనిపిస్తోంది.’ అని బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు విప్రో తెలియజేసింది. చెన్నైలో వరదల కారణంగా ఐటి రంగ సంస్థల కార్యకలాపాలు వారం రోజులకుపైగా మూతపడినది తెలిసిందే.

వాహన ధరలను పెంచిన టొయోటా
బెంగళూరు, డిసెంబర్ 16: టొయోటా కిర్లోస్కర్ మోటార్.. వాహన ధరలను వచ్చే నెల జనవరి 1 నుంచి 3 శాతం పెంచనుంది. అన్ని మోడళ్ల వాహనాలకు ఈ పెంపు వర్తిస్తుందని బుధవారం ఓ ప్రకటనలో టొయోటా స్పష్టం చేసింది. డాలర్‌తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువ, పెరిగిన ఉత్పాదక వ్యయం కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. కాగా, ఇప్పటికే మారుతి సుజుకి, రెనాల్ట్, నిస్సాన్, టాటా మోటార్స్, స్కోడా, హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, ఆడీ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించినది తెలిసిందే.