బిజినెస్

బ్యాంకింగ్ షేర్లు ఆకర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు మూడు నెలల గరిష్ఠాన్ని తాకుతూ 174.32 పాయింట్ల లాభంతో 27,882.46 వద్దకు చేరింది. నిరుడు అక్టోబర్ 30 నుంచి ఈ స్థాయికి సెనె్సక్స్ చేరుకోవడం ఇదే ప్రథమం. నాడు 27,930.21 వద్ద స్థిరపడింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 38.50 పాయింట్లు లాభపడి 8,641.25 వద్ద నిలిచింది. ఇకపోతే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 847.96 పాయింట్లు, నిఫ్టీ 291.90 పాయింట్లు పెరిగాయి. నిరుడు మే 27 నుంచి గమనిస్తే కేవలం ఒక వారంలో ఈ స్థాయి లాభాలను సూచీలు అందుకోవడం ఇదే. నాడు సెనె్సక్స్ 1,351.70 పాయింట్లు, నిఫ్టీ 406.95 పాయింట్లు పుంజుకున్నాయి. మళ్లీ ఈ వారమే గరిష్ఠ లాభాలను అందుకోగలిగాయి.
కాగా, శుక్రవారం ట్రేడింగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు మదుపరులను ఆకర్షించాయి. దీంతో బ్యాంకింగ్ సూచీ 1.50 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ లాభపడితే, హాంకాంగ్ సూచీ నష్టపోయింది. చైనా సూచీలకు సెలవు. ఇక ఐరోపా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది.
ఐటిసి మార్కెట్ సంపద
రూ. 9 వేల కోట్లు ఆవిరి
న్యూఢిల్లీ: బహుళ వ్యాపార సంస్థ ఐటిసి లిమిటెడ్ మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే సుమారు 9 వేల కోట్ల రూపాయలు క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మదుపరులను ఆకట్టుకోకపోవడమే దీనికి కారణం. దీంతో ఐటిసి మార్కెట్ సంపద 8,786.55 కోట్ల రూపాయలు పడిపోయి 3,12,247.45 కోట్ల రూపాయలకు చేరింది. ఐటిసి షేర్ విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ వద్ద 2.78 శాతం పతనమై 257.50 రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ వద్ద 3.2 శాతం కోల్పోయి 257.40 రూపాయలుగా ఉంది.