బిజినెస్

ఆదుకోవాలంటూ అర్థించాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి విమానయాన సేవలకు దూరమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని అధినేత విజయ్ మాల్యా స్పందించారు. కేంద్రంలోని గత ప్రభుత్వ విధానాలు, అప్పటి ఆర్థిక విపత్కర పరిస్థితులపై ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియాకు ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించారు. ప్రైవేట్‌రంగ సంస్థలకు ప్రభుత్వాల నుంచి ఆ రకమైన చేయూత లేదంటూ పరోక్షంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌పట్ల సర్కారు వైఖరిని దుయ్యబట్టారు. అందుకే ప్రభుత్వ విధానాలు మారాలని కోరానే తప్ప.. రుణ సాయం చేయాలని అర్థించలేదంటూ స్పష్టం చేశారు. తన సంస్థను ఆదుకోవాలని అర్థించానే కానీ.. రుణ సాయం చేయాలని అడుక్కోలేదన్నారు. ఇక 140 డాలర్లు పలికిన బ్యారెల్ చమురు ధర ప్రభావం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌పై చూపించిందన్న మాల్యా.. తన భోగలాలసలతోనే నష్టాలు వాటిల్లాయనడం సరికాదన్నారు.