బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు నిరుడు డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో తగ్గుముఖం పట్టాయి. 4,890 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. 2015 ఏప్రిల్-డిసెంబర్‌లో ఇవి 6,121 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా, ఆదాయం పెరగడంతో నష్టాలు తగ్గాయని సంస్థ చెబుతోంది. 2016 ఏప్రిల్-డిసెంబర్‌లో 19,379.6 కోట్ల రూపాయల ఆదాయం రాగా, 2015 ఏప్రిల్-డిసెంబర్‌లో 18,314.9 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో నష్టాలు మరింతగా తగ్గుముఖం పట్టగలవన్న ఆశాభావాన్ని బిఎస్‌ఎన్‌ఎల్ వ్యక్తం చేస్తోంది. జనవరి-మార్చిలో సంస్థ ఆదాయం పెరగవచ్చంది.