బిజినెస్

నన్ను ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు: మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: రుణ ఎగవేతదారులు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లిక్కర్ వ్యాపారి, రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా తనను తాను ఓ ఫుట్‌బాల్‌గా అభివర్ణించుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం, బిజెపి నేతృత్వంలోని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం తనతో ఫుట్‌బాల్ ఆట ఆడుకుంటున్నారని ట్విట్టర్‌లో వాపోయారు. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన మాల్యా.. నిరుడు లండన్‌కు చెక్కేసినది తెలిసిందే. పలు బ్యాంకులు ఇప్పటికే మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించగా, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయ.