బిజినెస్

జూలైలో యుద్ధవిమాన విడిభాగాల పరిశ్రమ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొనకొండ, ఫిబ్రవరి 4: ఈ ఏడాది జూలై నాటికి యుద్ధ విమానాల విడిభాగాల పరిశ్రమ పనులను ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ప్రారంభిస్తామని టైటాన్ ఏవియేషన్ ఏరోసిస్ సంస్థ చైర్మన్ గిరికుమార్ తెలిపారు. శనివారం మండలంలోని మల్లంపేట, కొచ్చర్లకోట, సిద్ధాయపాలెం, మంగినపుడి పరిధిలోని 5 వేల ఎకరాలకు చెందిన భూముల హద్దులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే మొదటిదశ పనులు జూలైలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గతంలో రెండు పర్యాయాలు భూమి సాంద్ర త, భౌగోళిక పరిస్థితులు, రవాణా పరిస్థితుల గురించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో 18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం జరిగిందన్నారు. కాగా, ఈ సంస్థ రష్యా, ఉక్రెయిన్ దేశాల సాంకేతిక సహకారంతో పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. దక్షణ భారతంలో యుద్ధవిమానాల విడిభాగాల పరిశ్రమను దొనకొండలో ఏర్పాటు చేయడం వలన ప్రపంచ దేశాలకు మధ్యస్తంగా ఉంటుందని, తద్వారా సాంకేతిక పరిజ్ఞానం దేశంలో కూడా పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 50 వేల మందికి ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు. అలాగే పైలెట్లకు ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అన్ని కోణాల్లో అధ్యయనం పూరె్తైనప్పటికీ 5 వేల ఎకరాల్లో పూర్తి హద్దులు ఏర్పాటు చేసుకొని జూలై నాటికి మొదటి దశ పనులు ప్రారంభించి దశలవారిగా పరిశ్రమ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్‌చైర్మన్ వై శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌తోపాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొనకొండ సమీపంలో నవ్యాంధ్ర రాజధాని వస్తుందన్న అంచనాల మధ్య భారీగా పరిశ్రమలు అక్కడ పెట్టుబడులకు సిద్ధమైనది తెలిసిందే. అయతే రాజధానిగా అమరావతి ప్రకటనతో అక్కడ డిమాండ్ పడిపోగా, ఏవియేషన్ పరిశ్రమతో కొత్త ఊపిరిలూదినట్లవుతోంది.