బిజినెస్

పన్ను ప్రోత్సాహకాలు పరిమితమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: యేటా 2 లక్షల రూపాయలకు మించి రెండో ఇంటి కొనుగోలుకు పన్ను ప్రోత్సాహకాలు ఉండవన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తేల్చిచెప్పారు. ‘అందరికీ ఇళ్లు’ అనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఇది తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. ఎవరైనా మిగులు నిధులున్నప్పుడే రెండో ఇంటి కొనుగోలుకు వెళ్తారని, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే అలాంటి వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. వారికి ప్రభుత్వ సాయం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. తొలిసారి ఇల్లు కొనేవారు అందులోనే ఉంటారని, రెండోసారి కొనే ఇల్లును అద్దెలకు ఇవ్వాలనే చూస్తారన్న ఆయన అదనపు ఆదాయం పొందడానికీ ప్రభుత్వ సబ్సిడీలు కావాలా? అని ప్రశ్నించారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 71 ప్రకారం రెండో ఇంటి కోసం తీసుకున్న గృహ రుణాలకు సంబంధించి చెల్లించే వడ్డీలో యేటా 2 లక్షల రూపాయల వరకే ఆదాయ పన్ను మినహాయింపును పరిమితం చేసింది ఆర్థిక బిల్లు 2017. దీన్ని ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించగా, దీనిపై రియల్ ఎస్టేట్ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం నిర్మాణ రంగాన్ని దెబ్బ తీస్తుందన్న ఆందోళనను వెలిబుచ్చుతున్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలకు ఊతమివ్వాల ని నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదానిచ్చిన కేంద్రం.. ఇప్పుడు రెండో ఇంటి గృహ రుణాలపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు రియల్టర్లు. మొత్తానికి ఇటు నిర్మాణ రంగం, అటు ప్రభుత్వం ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.
మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపులు పెరిగినప్పుడే పన్ను రేట్లు తగ్గడం జరుగుతుందని అధియా అన్నారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలనుకున్న కేంద్రం.. గత ఆర్థిక సంవత్సరం 2015-16 నుంచి దశలవారీగా నాలుగేళ్లలోగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించినది తెలిసిందే. ఈ క్ర మంలోనే ప్రజలంతా పన్నులు చెల్లించడానికి ముందుకు వస్తేనే పన్ను రేట్లు తగ్గుతాయని అధియా అన్నారు.