బిజినెస్

వంద దేశాలకు రొయ్యల ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 5: తెలుగు రాష్ట్రాల్లో సాగుచేస్తున్న వనామి రొయ్య ప్రపంచంలోని వంద దేశాలకు ఎగుమతి అవుతోందని ఎంపెడా జాయింట్ డైరక్టర్ సంపత్‌కుమార్ చెప్పారు. అమెరికాతోపాటు జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ దేశాలకు మరింత ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆక్వా ప్రొఫెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రంలోని ఆక్వా రైతాంగానికి రొయ్యల సాగులో యాంటిబయోటిక్స్ వాడకంవల్ల వస్తున్న సమస్యలు తదితరాలపై అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సదస్సులో పాల్గొన్న సంపత్‌కుమార్ మాట్లాడుతూ రొయ్యల సాగులో యాంటిబయోటిక్స్ వినియోగించకూడదని అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గత కొంత కాలంగా రొయ్యల యాంటీబయోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉండటంవల్ల ఇక్కడ ఉత్పత్తిచేస్తున్న రొయ్యల కంటైనర్లను వివిధ దేశాలు వెనక్కి పంపిచేస్తున్నారన్నారు. దీనివల్ల ఎగుమతిదారులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారని వివరించారు. వివిధ దేశాలు యాంటీబయోటిక్స్‌ని నిషేధించడంవల్ల ఈ పరిస్థితి తలెత్తుతోందన్నారు. రైతులు యాంటీబయోటిక్స్ వినియోగానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రొయ్యలను 30, 60, 90 రోజులకు ఒకసారి పరీక్షలు చేస్తున్నారన్నారు. ఎంపెడా నెల్లూరు, భీమవరంతోపాటు కొచ్చిన్‌లో రొయ్యల పరీక్షల ల్యాబ్‌లను ఒకొక్కటి రూ.2కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. 2015-16లో దేశం నుంచి 9,45,892 టన్నుల సముద్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశారన్నారు. వీటి విలువ రూ.30,420.83 కోట్లు ఉందన్నారు. వీటిలో ఒక్క రొయ్య విషయానికి వస్తే రూ.20,045.50 కోట్ల విలువ చేసే 3,73,866 టన్నులను ఎగుమతి చేశామని గుర్తుచేశారు. ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ 1996లోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు యాంటిబయోటిక్స్‌ని నిషేధించారన్నారు. ఇప్పటికే 20 రకాల యాంటిబయోటిక్స్‌ను ఎంపెడా రద్దు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకు అవార్డులను అందచేశారు. అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఎస్ రాజారామం పాల్గొన్నారు.

చిత్రం..అవగాహనా సదస్సులో మాట్లాడుతున్న సంపత్‌కుమార్