బిజినెస్

క్యూ3 ఫలితాలన్నీ వచ్చాకే పిఎస్‌బిలకు తుది పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత వాటికి సమకూర్చాల్సిన రెండవ, తుది విడత పెట్టుబడులను ప్రభుత్వం ఖరారు చేయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ రంగంలోని మొత్తం 26 లిస్టెడ్ బ్యాంకుల్లో ఇప్పటివరకూ కేవలం ఐదు బ్యాంకులు మాత్రమే ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమకూర్చాల్సిన తుది విడత పెట్టుబడుల ఖరారుపై కసరత్తు చేస్తున్నామని, అయితే ఇంకా అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నందున ఆ గణాంకాల కోసం ఎదురు చూస్తున్నామని ఆ అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 25 వేల కోట్ల రూపాయల్లో రూ.22,915 కోట్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్లు గతంలోనే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వీటిలో ఇప్పటివరకూ 75 శాతం నిధులను విడుదల చేసింది. బ్యాంకుల రుణ సామర్ధ్యాన్ని పెంపొందించడంతో పాటు మార్కెట్ నుంచి మరిన్ని నిధులను సమీకరించుకునేలా వాటికి చేయూతనివ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గత జూలై మాసంలో తొలి విడత పెట్టుబడులను ప్రకటించిన విషయం విదితమే.