బిజినెస్

నాలుగింతలైన పిఎన్‌బి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) లాభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో నాలుగింతలైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 51.1 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందిన పిఎన్‌బి.. ఈ అక్టోబర్-డిసెంబర్‌లో 207.18 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. ఆదాయం కూడా ఈసారి గతంతో పోల్చితే 4.36 శాతం పెరిగి 14,497.65 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు ఇది 13,891.2 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. కాగా, బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్‌పిఎ) గతంతో చూస్తే 8.47 శాతం నుంచి 13.70 శాతానికి పెరిగాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 5.86 శాతం నుంచి 9.09 శాతం మేర ఎగిశాయి.