బిజినెస్

మరింతగా ఐడిబిఐ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,254.96 కోట్ల రూపాయల నికర నష్టాలను చవిచూసింది. పెరిగిన మొండి బకాయిలు (నికర నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ), తగ్గిన ఆదాయం దీనికి కారణమని మంగళవారం బ్యాంక్ తెలిపింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో బ్యాంక్ నష్టం 2,183.68 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం విషయానికొస్తే ఈసారి 7,104.21 కోట్ల రూపాయలుగా, పోయినసారి 7,361.86 కోట్ల రూపాయలుగా ఉంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 15.16 శాతం పెరగగా, నికర నిరర్థక ఆస్తులు 9.61 శాతం పెరిగాయి. నిరుడు స్థూల నిరర్థక ఆస్తులు 9.84 శాతం, నికర నిరర్థక ఆస్తులు 4.60 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ తెలిపింది.