బిజినెస్

పావు శాతం కోతకు అవకాశం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మందగించిన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీలతోపాటు నీరసించిన బ్యాంకింగ్ కార్యకలాపాలను తిరిగి ఉత్తేజపరిచేందుకు బుధవారం నిర్వహించే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈసారేగాక, వచ్చేసారి (ఏప్రిల్ ద్రవ్యసమీక్షలో) కూడా వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాను బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ వ్యక్తం చేసింది. మంగళవారం ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) సమావేశమైన క్రమంలో ‘బుధవారం జరిగే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేటును ఆర్‌బిఐ-ఎమ్‌పిసి.. పావు శాతం తగ్గిస్తుందని మేము భావిస్తున్నాం. వృద్ధిరేటును పాత పెద్ద నోట్ల రద్దు దెబ్బతీసినందున ఏప్రిల్‌లోనూ పావు శాతం వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందని ఆశిస్తున్నాం.’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. నొమురా తదితర అంతర్జాతీయ సంస్థలూ ఈసారి వడ్డీరేట్ల తగ్గింపు ఉండవచ్చనే అభిప్రాయానే్న వెలిబుచ్చుతున్నాయి.