బిజినెస్

ఫార్మా దిగ్గజం ‘నోవార్టిస్’తో టి-హబ్ ఎంఓయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణలో హెల్త్ టెక్ స్టార్టప్స్‌ను సంయుక్త నిర్వహణలో చేపట్టేందుకు వీలుగా ఫార్మా దిగ్గజం నోవార్టిస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పిఎల్)తో టి-హబ్ అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. నోవర్టిస్‌తో కలిసి పనిచేయడం వల్ల హెల్త్ టెక్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ స్టార్టప్స్ స్ధాపన, వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని టి హబ్ ఇన్‌క్యుబేటర్ పేర్కొంది. నోవార్టిస్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోన్ని ఇస్తోందని టి హబ్ సిఈఓ జయ కృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ కేర్ రంగంలో టి హబ్‌తో కలిసి సంబంధిత స్టార్టప్స్‌ను విస్తత్రంగా నెలకొల్పే అద్భుత అవకాశం బయో మెడికల్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న తమ నోవార్టిస్‌కు లభించడం అద్భుత అవకాశంగా భావిస్తున్నామని ఆ కంపెనీ గ్లోబల్ డ్రగ్ డెవలెప్‌మెంట్ ఇండియా హెడ్ సుభోధ్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు.