బిజినెస్

వరుస లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లోనే ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షకు ముందు మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 173.93 పాయింట్లు పుంజుకుని 25,494.37 వద్ద ముగిసింది.
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 7,750.90 వద్ద స్థిరపడింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటు 18 శాతం దిగువనే ఉంటుందని, ఒక శాతం అదనపు పన్ను తొలగించే అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇక ఆయా రంగాలవారీగా టెలికాం, చమురు, గ్యాస్, యుటిలిటీస్, విద్యుత్, టెక్నాలజీ, బ్యాంకింగ్, ఇంధనం, ఐటి, ఫైనాన్స్ రంగాల షేర్ల విలువ 2.42 శాతం నుంచి 1.01 శాతం వరకు లాభపడ్డాయి. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో రంగాల షేర్ల విలువ 0.58 శాతం నుంచి 0.51 శాతం వరకు పడిపోయింది.
బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 0.24 శాతం, మిడ్-క్యాప్ 0.35 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.17 శాతం నుంచి 2.61 శాతం వరకు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా 0.12 శాతం నుంచి 0.48 శాతం వరకు పెరిగాయి.

హిందుజా విద్యుత్ ప్లాంట్ వ్యవహారంపై బహిరంగ విచారణ?

హైదరాబాద్, డిసెంబర్ 16: విశాఖపట్నంలో విద్యుదుత్పత్తికి సిద్ధమైన హిందుజా విద్యుత్ థర్మల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ ఫిక్స్‌డ్ కాస్ట్‌ను ఖరారు చేసేందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు తెలిసింది. 1,040 మెగావాట్ల కెపాసిటీ ఉన్న హిందూజా విద్యుత్ ప్లాంట్ ఫిక్స్‌డ్ కాస్ట్‌కు సంబంధించి ఏపి ట్రాన్స్‌కో, హిందుజా మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కిరాలేదు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యత ఏపిఇఆర్‌సి స్వీకరించనున్నట్లు సమాచారం. 1998లో ఈ ప్లాంట్ ఏర్పాటుపై హిందుజా సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది. 1999లో అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం హిందుజాకు దేవాడ, పాలవలస వద్ద 1,122 ఎకరాలను కేటాయించింది. ఈ ప్లాంట్ నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ఈ ప్లాంట్ నిర్మాణం సమయంలో రూ. 5500 కోట్ల వ్యమమవుతుందని అంచనా వేశారు. ఒక మెగావాట్ ఉత్పత్తికి రూ. 5.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కాగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చయిందని హిందుజా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు తెలియజేసింది. రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో హిందుజా గురించి నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని రాష్ట్రప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది.