బిజినెస్

మూడేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చిల్లర ద్రవ్యోల్బణం.. గత నెలలో మూడేళ్లకుపైగా కనిష్టానికి తగ్గింది. జనవరిలో 3.17 శాతంగా నమోదెనట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు నెల డిసెంబర్‌లో 3.41 శాతంగా ఉండగా, నిరుడు జనవరిలో ఇది 5.69 శాతంగా ఉండటం గమనార్హం. నోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపార కార్యకలాపాలు ధరల తగ్గుముఖానికి దోహదపడ్డాయి. వినియోగదారులకు చిల్లర కష్టాలు ఏర్పడటం, చిరు వ్యాపారుల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు నడవకపోవడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దించింది.