బిజినెస్

చెక్ బౌన్స్ కేసులో మాల్యాకు వారెంట్ జారీ చేసిన హైదరాబాద్ కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్ నగర మూడవ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.. రాజ్యసభ సభ్యుడు, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు వారెంట్‌ను జారీ చేసింది. వచ్చేనెల 5న కోర్టు ఎదుట హాజరై తన వాదనను వినిపించాలని ఆదేశించింది. కాగా, చెక్ బౌన్స్ కేసును జిఎంఆర్ సంస్థ దాఖలు చేసింది. హైదరాబాద్ జిఎంఆర్ విమనాశ్రయాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉపయోగించుకుంది. దీనికి రూ. 50 లక్షల విలువైన రెండు చెక్‌లను సంస్థ ఇచ్చింది. ఇక ఈ కేసులో జిఎంఆర్ తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మాల్యా రూ. 25 కోట్లు బకాయిలు ఉన్నారని, ఒప్పందం తర్వాత రూ. 22 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారన్నారు. ఈ ఒప్పందం తర్వాత జిఎంఆర్ కంపెనీ కేసులను ఉపసంహరించుకుందన్నారు. అనంతరం మాల్యా 45 చెక్‌లను బకాయిలకు సంబంధించి ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజా చెక్ బౌన్స్ కేసు నమోదైంది.