బిజినెస్

కోనసీమ కొబ్బరికి ప్రభుత్వ మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 20: రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కోనసీమ కొబ్బరికాయలను ఎగుమతి చేసేందుకు మార్కెటింగ్ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. కొబ్బరికాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కోనసీమ కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కోనసీమలో ప్రస్తుతం రైతుల నుండి మద్దతు ధరకు కొబ్బరికాయలను కొనుగోలు చేసి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని రైతు బజార్లకు పంపుతున్నారు. అంతేగాక ఆయా రైతు బజార్లలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొబ్బరికాయలు విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కోనసీమలో కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్న చిన్న, పెద్ద రైతులకు ఉపశమనం కలిగిస్తోంది. గత ఏడాది కోనసీమలో 1,000 కొబ్బరికాయల ధర రూ. 10 వేలు పలకగా, ఈ ఏడాది రూ. 3,000 నుండి 3,500కు పడిపోయంది. గత 4 నెలలుగా ఇదే ధర పలుకుతుండటంతో ఈ పరిణామం కోనసీమ కొబ్బరి రైతులకు శిరోభారంగా మారింది. గిట్టుబాటు ధర లభించకపోవడంతో కొబ్బరి సాగుపై ఆధారపడిన రైతులు తమను ఆదుకోవల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతుల నుండి నేరుగా కొబ్బరికాయలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మార్కెటింగ్ శాఖ ద్వారా కొబ్బరికాయను ప్రస్తుతం 6 నుండి 7 రూపాయలకు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఆయా జిల్లాలలో రైతు బజార్ల నిర్వాహకుల నుండి మార్కెటింగ్ శాఖాధికారులకు అందుతున్న ఇండెంట్ ఆధారంగా కొబ్బరికాయలను రైతుబజార్లకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోనసీమలోని అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఈ నెల 3న కొబ్బరి సేకరణ ప్రారంభించారు. చిన్న కొబ్బరికాయ ఒక్కింటికి 6 రూపాయలు, పెద్ద కాయలకు 7 రూపాయల వంతున చెల్లిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా తొలిసారిగా కోనసీమ రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం ప్రవేశపెట్టినట్టు సహాయ మార్కెటింగ్ సంచాలకుడు కెవిఆర్‌ఎన్ కిశోర్ చెప్పారు. కోనసీమ సహా కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఈ పథకం ఆసరా అందిస్తుందన్నారు. రైతులు తమ పంటను వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా, ఈ మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం ద్వారా లబ్ధిపొందాలని విజ్ఞప్తిచేశారు. రైతుల వద్ద ఉన్న కొబ్బరికాయలను పూర్తిగా కొనుగోలు చేసేవరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.