బిజినెస్

146 పాయింట్లు పుంజుకున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 16: గత కొన్ని రోజులుగా నష్టాల బాటలో పడ్డ సెనె్సక్స్ గురువారం గట్టిగా పుంజుకుంది. లావాదేవీలు ముగిసే సమయానికి 146 పాయింట్లు సాధించి 28,301 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటి, ఫార్మా సంస్థలు నేటి లావాదేవీల్లో గణనీయంగా లాభపడ్డాయి. ముఖ్యంగా షేర్ల బైబ్యాక్ ప్రతిపాతనను వచ్చేవారి ప్రతిపాదిస్తామంటూ టిసిఎస్ సంస్థ చెప్పడంతో ఐటి షేర్లను ఇనె్వస్టర్లు దృష్టి సారించారు. అలాగే ఫార్మా కంపెనీ ల షేర్లకు కూడా భారీగానే డిమాండ్ ఏర్పడింది. ము ఖ్యంగా సూక్ష్మ ఆర్థిక ప్రగతి వివరాలు సానుకూలం గా రావడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. 28,223 పాయింట్ల వద్ద మొదలైన సెనె్సక్స్ ఒకదశలో ఊగిసలాడినా అంతిమంగా ఐటి, ఫార్మా షేర్లు పుంజుకోవడంతో 146 పాయిం ట్లు లాభపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఇకి చెందిన నిఫ్టీ కూ డా 53.30 పాయింట్లు పెరిగి 8,778కి చేరుకుంది.