బిజినెస్

‘వేగంగా కొత్త కరెన్సీ ముద్రణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దాదాపు సాధారణ పరిస్థితులను తెచ్చామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ సిఎన్‌బిసి-టివి18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రద్దయిన పాత కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీని తెచ్చే ప్రక్రియ వేగంగా, విజయవంతంగా జరుగుతోందన్నారు. మరోవైపు ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉండగానే ఉర్జిత్ పటేల్.. కొత్త కరెన్సీ నోట్లపై సంతకాలు చేశారు. ఆర్‌బిఐ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త 2,000 రూపాయల నోట్ల తొలి విడత ముద్రణ నిరుడు ఆగస్టు 22న జరిగింది. 23న ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్‌ను అధికారికంగా ప్రకటించారు. కాగా, రాజన్ ఉన్న సమయంలోనే కరెన్సీ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా, దీనికి రాజన్ విముఖత ప్రదర్శించారని, అందుకే కాబోయే కొత్త గవర్నర్ ఉర్జిత్ సంతకాలతో నోట్ల ముద్రణ జరిగిందని సమాచారం. అయితే ఈ విషయంపై ఆర్‌బిఐ మాత్రం ఏవిధంగాను స్పందించడం లేదు.