బిజినెస్

డిఫాల్టర్లు పారిపోకుండా చూడాల్సింది బ్యాంకర్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 20: తీసుకున్న రుణాలను ఏ వ్యక్తీ లేదా సంస్థ ఎగవేసి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా 17 బ్యాంకుల నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని, లండన్‌కు గుట్టుచప్పుడు కాకుండా చేరుకున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సోమవారం ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరిక మేరకు మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసినది తెలిసిందే. ఈ నెల 21లోగా అన్ని ఆస్తుల వివరాలను ప్రకటించాలని మాల్యాకు సుప్రీం కోర్టు కూడా ఆదేశించింది. కొంతమేరు రుణాలను చెల్లిస్తానని మాల్యా చెప్పినదానికి బ్యాంకులు అంగీకరించకపోవడం, ఒకేసారి పూర్తిగా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన క్రమంలో అత్యున్నత న్యాయస్థానం గురువారంలోగా ఆస్తుల వివరాలను వెల్లడించాలంది. ఇక అంతకుముందు కేంద్ర ప్రభుత్వం సైతం మాల్యా పాస్‌పోర్టును నిలిపివేసింది. విదేశాల నుంచి మాల్యాను భారత్‌కు రప్పించి ఎలాగైనా తీసుకున్న రుణాలను చెల్లించేలా కేంద్ర తగిన చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న జైట్లీ ఓ ప్రముఖ వార్తా చానల్‌తో ఈ విషయంపై మాట్లాడారు. మొండి బకాయిలు బ్యాంకింగ్ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న క్రమంలో రుణాలు తీసుకున్నవారి కదలికలపై బ్యాంకులు ఓ కనే్నసి ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అయినా ప్రజాధనాన్ని జేబులో వేసుకుని పారిపోవడం అంత సులువేమీ కాదన్నారు. కాగా, మాల్యా వ్యవహారం కోర్టుల్లో ఉన్నందున దానిపై తాను పెద్దగా స్పందించలేనని అన్నారు. మరోవైపు మాల్యా కూడా తాను ఎక్కడికీ పారిపోలేదని, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోవడం దురదృష్టకరమని, విమానయాన రంగంలో ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఇదంతా జరిగిందని గతంలో అన్నారు.
వొడాఫోన్ ట్యాక్స్ కేసుపై..
8,500 కోట్ల రూపాయల వొడాఫోన్ పన్ను కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేయడాన్ని జైట్లీ సమర్థించుకున్నారు. ఈ కేసు పునరవలోకనంతో ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన ఏ సంస్థ కూడా పన్ను చెల్లింపుల నుంచి తప్పించుకోవడం కుదరదన్నారు. ‘సవాల్ చేయదగిన తీర్పు అని ప్రభుత్వం భావించినప్పుడు ఎందుకు పై కోర్టులో దానిపై సవాల్ చేయకూడదు.’ అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో బాంబే హై కోర్టు వొడాఫోన్‌కు మద్దతుగా నిరు డు అక్టోబర్ 8న తీర్పునివ్వగా, దీన్ని స్పెషల్ లీవ్ పిటీషన్ ద్వారా సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించుకుంది.