బిజినెస్

మార్కెట్లకు టిసిఎస్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఐటి దిగ్గజం టిసిఎస్ షేర్ బైబ్యాక్ ప్రకటనతో ఆ సంస్థ షేర్లు మదుపరులను అమితంగా ఆకర్షించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 192.83 పాయింట్లు ఎగిసి 28,661.58 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 57.50 పాయింట్లు అందుకుని 8,879.20 వద్ద నిలిచింది. టెలికామ్, మెటల్ షేర్లకూ మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలక సూచీలైన జపాన్, చైనా, హాంకాంగ్‌లు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లు కూడా లాభాల్లోనే కదలాడాయి.
రూ. 19,379 కోట్లు పెరిగిన
టిసిఎస్ మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: షేర్ బైబ్యాక్ ఆఫర్‌తో టిసిఎస్ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే 19,379 కోట్ల రూపాయలు ఎగిసింది. ఒక్కో షేర్ విలువ 4 శాతం పెరగగా, మొత్తం దీని మార్కెట్ విలువ 4,93,887.76 కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ)లోని సంస్థల విలువ రికార్డు స్థాయిలో 117 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది.