బిజినెస్

వ్యూహాత్మక భాగస్వామ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 20: అంతర్జాతీయ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్.. భారతీయ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా, ఇందులో భాగంగానే సోమవారం ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సిఇఒ బిన్ని బన్సల్‌తో కలిసి ఆయన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ తమ ఎగ్జిక్యూటివ్ పబ్లిక్ క్లౌడ్ వేదికగా మైక్రోసాఫ్ట్ అజూర్‌ను తీసుకోనుంది. దేశీయంగా అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ సేవలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతోనే మైక్రోసాఫ్ట్‌తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యమని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ‘మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేము కలిసి ప్రారంభించాం. ఫ్లిప్‌కార్ట్ సేవలు హర్షణీయం. ఈ-కామర్స్‌లోనేగాక పేమెంట్స్, లాజిస్టిక్స్‌లో దాని సేవలు ప్రశంసనీయం. అలాంటి ఫ్లిప్‌కార్ట్.. తమ ఎగ్జిక్యూటివ్ పబ్లిక్ క్లౌడ్ వేదికగా మైక్రోసాఫ్ట్ అజూర్‌ను ఎంచుకుందని ప్రకటించడం మాకు గౌరవంగా ఉంది.’ అని నాదెళ్ల అన్నారు. కాగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎక్‌స్టెప్ సహవ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నిలేఖని కూడా పాల్గొన్నారు.
ఉబర్ క్యాబ్‌తో జియో
ముంబయి, ఫిబ్రవరి 20: క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్‌తో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జియో మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తీసుకొచ్చిన ప్రీ-పెయిడ్ వాలెట్ ద్వారా ఉబర్ క్యాబ్ ప్రయాణీకులు తమ చెల్లింపులు జరిపే సౌలభ్యం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో రానుంది. రిలయన్స్ పేమెంట్ సొల్యూషన్స్ ప్రారంభించిన జియోమనీ వాలెట్ వినియోగదారులు ఉబర్ క్యాబ్ సేవలను జియోమనీ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ మేరకు సోమవారం ఇక్కడ రిలయన్స్ జియో ప్రకటించింది. ఉబర్ ఇండియా నూతన చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్ తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా చేయడమే లక్ష్యంగా జియోతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉబర్ కుదుర్చుకుంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్ లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. నగదు కొరత కారణంగా క్రెడిట్, డెబిట్ కార్డులను వాడాలని కేంద్రం సూచిస్తుండగా, ఎన్నో ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రత్యేక యాప్‌లతో కస్టమర్లకు ప్రయోజనకరమైన సేవలను అందిస్తున్నాయి.