బిజినెస్

విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యంతోనే ఆర్థికాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రభుత్వ విధానాలు, వాటి అమలు, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలపై మేనేజిమెంట్ విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ ప్రావీణ్యానికి పదును పెట్టుకోగలుగుతారని పలువురు ఐఎఎస్ అధికారులు సూచించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్ ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజిమెంట్ విద్య ప్రభుత్వ విధానాలు, అవసరాలు సవాళ్లు అనే అంశంపై బుధవారం ఇక్కడ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పికె మహంతి మాట్లాడుతూ, భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) వ్యవస్థ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందన్నారు. కానీ, చైనాలో సెజ్‌లు విజయవంతమయ్యాయన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రజలతో, వ్యాపార వర్గాలతో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకోవడమే కారణమన్నారు. ప్రభుత్వ విధానాలతో వస్తున్న మార్పులను మేనేజిమెంట్ విద్యార్థులు గమనిస్తూ పుస్తక పఠనం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని రిటైర్డు ఐఎఎస్ అధికారి, ఐపి నైపుణ్యాభివృద్ధి కేంద్ర డైరెక్టర్ డాక్టర్ కె లక్ష్మీనారాయణ అన్నారు. ఐఎఎస్ ఆఫీసర్ మహమ్మద్ అబిద్, డాక్టర్ ఎం గోపినాథరెడ్డి, తన్మయ్ దాస్, డాక్టర్ అలోక్ మిశ్రా,డాక్టర్ హరీష్ శ్రీవాత్సవ ప్రసంగించారు.

సదస్సులో పాల్గొన్న ఐఎఎస్ అధికారులు