బిజినెస్

ఇంటెల్‌లో 12,000 ఉద్యోగాల కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, ఏప్రిల్ 20: మైక్రోప్రాసెసర్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇంటెల్.. భారీగా ఉద్యోగులను తొలగించనుంది. దాదాపు 12,000 మంది ఉద్యోగులను తీసేసేందుకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ ఉద్యోగుల సంఖ్య 1,07,300గా ఉంది. కాగా, ఈ సంఖ్యలో సుమారు 11 శాతం మందిని 2017 మధ్య నాటికి తొలగించాలని ఇంటెల్ భావిస్తోంది. సకల సౌకర్యాలున్న స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరగడం, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు తగ్గడం ఇంటెల్ ఉద్యోగాల కోతకు దారితీసింది.