బిజినెస్

ఆర్థోస్ బీరు ఫ్యాక్టరీ లాకౌట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, ఫిబ్రవరి 27: సుమారు 57 సంవత్సరాల క్రితం కోస్తాంధ్రలో ఏకైక బ్రూవరీస్ సంస్థగా గణతికెక్కిన తూర్పు గోదావరి జిల్లాలోని ఆర్టోస్ (ప్రస్తుతం ఆర్థోస్) బీరు ఫ్యాక్టరీ గత సంవత్సర కాలంగా ఉత్ఫత్తిని నిలిపివేసిన నేపథ్యంలో కార్మికులను కర్మాగారంలోకి రావద్దంటూ యాజమాన్యం సోమవారం గేట్ నోటీసు జారీ చేసింది. ఈ పరిస్థితిని కార్మికులు లాకౌట్ కాని లాకౌట్‌గా అభివర్ణిస్తూ రోడ్డెక్కారు. ఉదయం 6 గంటల షిఫ్ట్‌కు హాజరయ్యేందుకు వెళ్ళిన కార్మికులకు గేటుకు తాళం కనిపించింది. ఒక నోటీసు బోర్డు ద్వారా ‘మీరు కంపెనీకి రావల్సిన పని లేదు.. మీరు ఇంటి వద్ద కూర్చున్నా జీతాలందిస్తాం..’ అని యాజమాన్యం నోటీసులో పేర్కొంది. దీంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. తామంతా 30 సంవత్సరాలకు పైబడి ఆ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నామని, మద్యపాన నిషేధంకు ముందు, నిషేధం తొలగించిన తరువాత కూడా తామంతా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంస్థలో చివరిగా ఉత్ఫత్తి 2016 మార్చి 15న జరిగిందని, అప్పటి నుండి ఉత్పత్తి లేదని తెలిపారు. తామంతా ఆర్ధికపరమైన అంశాలను పక్కనపెట్టి 3 మాసాల సమయానికి రెండు మాసాల జీతాలు మాత్రమే అందిస్తున్నప్పటికీ, కర్మాగారంలో ఉంటున్నట్లు చెప్పారు. ఈ నెల 20న శాసనసభ్యుడు తోట త్రిమూర్తులుకు, తమ ఇబ్బందులను తెలియజేశామన్నారు. దీంతో కార్మికుల సమస్యలను ఈ నెల 28వ తేదీలోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే యాజమాన్యానికి లేఖ రాశారు. అయితే 27నే యాజమాన్యం గేట్ నోటీసు పెట్టి, గత్యంతరం లేని పరిస్థితికి తీసుకువచ్చిందని కార్మికులు వాపోయారు. ఈ మేరకు అమలాపురం సహాయ కార్మిక శాఖ కమిషనర్, రామచంద్రపురం సహాయ కార్మిక అధికారి, కాకినాడ కార్మిక శాఖ ఉప కమిషనర్‌కు వినతి పత్రాలను కార్మికులు పంపించారు.

చిత్రం..కర్మాగారం బయట ధర్నాకు దిగిన ఆర్థోస్ బ్రూవరీస్ కార్మికులు