బిజినెస్

హైదరాబాద్ బిర్యానీకి దక్కని జీఐ ట్యాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: పేరొందిన హైదరాబాద్ బిర్యానీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ దక్కలేదు. తొలిసారిగా నిజాం నవాబు హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేసిన ఈ బిర్యానీ ఎంతోమందికి నచ్చింది. హైదరాబాద్ విచ్చేసిన ప్రపంచలోని ఎక్కడి వారైనా మెచ్చుకోవాల్సిందే, ఆ రుచికి దాసాహం కావాల్సిందే. కానీ జీఐ ట్యాగ్ సంపాదించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ బిర్యానీ చరిత్రకు సంబంధించిన తగిన పత్రాలను సమర్పించ లేకపోవడమే కారణం. 2009లోనే దక్కనీ బిర్యానీ మేకర్స్ అసోసియేషన్ తమకు జీఐ ట్యాగ్ కావాలని దరఖాస్తు చేసుకుంది. కానీ బిర్యానీకి సంబంధించిన సమగ్ర చరిత్ర, దాని మూలాల సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించడంలో ఆ అసోసియేషన్ విఫలం కావడంతో జీఐ ట్యాగ్ దక్కలేదు. ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేక ఉత్పత్తి, వస్తువు దొరుకుతుందని అంటే దానికి జీఐ ట్యాగ్ ఇస్తారు. అప్పుడు ఆ పేరును ట్యాగ్ పొందిన వారు తప్ప వేరే ఎవరూ వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో బిర్యానీ చరిత్ర, దాని ఆధారాల గురించి గెజిట్ పబ్లికేషన్ల వంటివి సమర్పించాల్సి ఉంటుంది, కానీ అవి చూపించకపోవడంతో జీఐ ట్యాగ్ దక్కలేదని ఆయా వర్గాల సమాచారం.