బిజినెస్

జిఎస్‌టితో మరిన్ని ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను త్వరగా అమల్లోకి తీసుకురావడం వల్ల అది ఉద్యోగ సృష్టికి దోహదపడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా లగార్డే అభిప్రాయపడ్డారు. ఆదాయావకాశాలు కూడా పెరుగుతాయని, దేశీయ ఉత్పాదక సామర్థ్యం కూడా పెరుగుతుందన్నారు. జిఎస్‌టిపై బుధవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పరిశ్రమ వర్గాల సమావేశం సందర్భంగా ఓ వీడియో సందేశంలో లగార్డే పైవిధంగా స్పందించారు. దేశ ఆర్థిక ప్రగతితోపాటు, విద్యావ్యవస్థ బలోపేతానికీ జిఎస్‌టి కృషి చేస్తుందన్నారు.
జిఎస్‌టి రేటు 18 శాతం మించదు: జైట్లీ
అరుణ్ జైట్లీ మాట్లాడుతూ జిఎస్‌టి రేటు 18 శాతానికి దిగువనే ఉంటుందని హామీ ఇచ్చారు. లోక్‌సభలో జిఎస్‌టి బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజారిటీ ఉన్న బిజెపి ప్రభుత్వానికి.. రాజ్యసభలో తగిన మెజారిటీ లేదన్నది తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోనూ నరేంద్ర మోదీ సమావేశమవగా, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా ఒక శాతం అదనపు పన్నును కూడా తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని జైట్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఇది రాజ్యాంగ బిల్లుకు ఆమోదయోగ్యం కాదన్నారు. ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అర్వింద్ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో తెచ్చే సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. పన్నుల విషయంలో భారత్ మొండిగా వ్యవహరిస్తుందన్న అపవాదును తొలగించేలా సరళమైన పన్ను విధానాలను తెస్తున్నామన్నారు.
సంస్కరణలతోనే అదుపులో ద్రవ్యోల్బణం
ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు, అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన ముడి చమురు ధరల ఫలితంగానే ద్రవ్యోల్బణం అదుపులో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) సూచీ గణాంకాలు గత ఏడాది నవంబర్ నుంచి మైనస్‌లోనే కొనసాగుతున్నది తెలిసిందే.