బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు ‘వడ్డీ’ కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 22: దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 20.2 శాతం వృద్ధి చెంది 3,374.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. పెరిగిన నికర వడ్డీ ఆదాయం లాభాల్లో చెప్పుకోదగ్గ వృద్ధికి కారణమైందని శుక్రవారం బ్యాంక్ తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే సమయంలో 2,807 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఆదాయం ఈసారి 18,862.61 కోట్ల రూపాయలుగా, పోయినసారి 15,570.1 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, ఈ జనవరి-మార్చిలో నికర వడ్డీ ఆదాయం 24 శాతం పెరిగి 7,453.3 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ స్పష్టం చేసింది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి, ఏప్రిల్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఆరు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 42.24 పాయింట్లు నష్టపోయి 25,838.14 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 12.75 పాయింట్లు కోల్పోయి 7,899.30 వద్ద నిలిచింది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ 0.78 శాతం నుంచి 0.46 శాతం వరకు పడిపోయింది.

కెయిర్న్ ఇండియాకు రూ. 10,948 కోట్ల నష్టం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కెయిర్న్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో మునుపెన్నడూ లేనివిధంగా భారీ నష్టాలను చవిచూసింది. ఏకంగా 10,948.22 కోట్ల రూపాయల నికర నష్టాన్ని శుక్రవారం ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో కేవలం 240.82 కోట్ల నికర నష్టానే్న పొందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన ముడి చమురు ధరలు, చమురేతర ఆదాయం క్షీణించడం వంటివి ఈ భారీ నష్టాలకు కారణమయ్యాయి.