బిజినెస్

ఈ ఏడాది జిడిపి వృద్ధి 7.8 శాతం: నొమురా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారత జిడిపి వృద్ధి ఈ ఏడాది 7.8 శాతాన్ని తాకవచ్చని అంతర్జాతీయ సంస్థ నొమురా అంచనా వేసింది. వేతన సంఘం సిఫార్సుల అమలు, సాధారణ వర్షపాతం, పెరిగే కొనుగోళ్ల శక్తి, ఉత్పాదక సామర్థ్యం మధ్య నిరుడు 7.3 శాతంగా ఉన్న దేశ జిడిపి.. ఈ ఏడాది 7.8 శాతానికి చేరుతుందని నొమురా ఓ రిసెర్చ్ నోట్‌లో శుక్రవారం పేర్కొంది. కాగా, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, అధిక చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం వంటివి ఆర్‌బిఐకి ఉన్న వడ్డీరేట్ల కోత అవకాశాలను తగ్గించే వీలుందని చెప్పింది.

42,300 ఫిగో, అస్పైర్ కార్ల రీకాల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అమెరికా ఆటోరంగ సంస్థ ఫోర్డ్.. భారతీయ మార్కెట్‌లో దాదాపు 42,300 ఫిగో, ఫిగో అస్పైర్ కార్లను రీకాల్ చేయనుంది. ప్రమాదాల సమయంలో ఎయిర్‌బ్యాగుల పనితీరును దెబ్బతీస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ సమస్యను పరిష్కరించేందుకుగాను ఈ కార్లను ఫోర్డ్ వెనక్కి పిలవనుంది. సనంద్ ప్లాంట్‌లో ఈ మోడళ్ల కార్లు తయారవగా, ఈ నెల 12 వరకు తయారుచేసిన కార్లలో ఈ లోపం తలెత్తినట్లు సంస్థ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపింది. కాగా, ఇంతకుముందు 2013 సెప్టెంబర్‌లో కూడా 1,66,021 ఫిగో, ఫియస్టా క్లాసిక్ మోడళ్లను ఫోర్డ్ ఇండియా రీకాల్ చేసింది.