బిజినెస్

ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 7,888కి పెంచిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఆయిల్‌పామ్ ఉత్పత్తి టన్ను ధరను రూ. 7,888కి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయిల్ పామ్ డెవలపర్స్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ గోయంగా స్వాగతించారు. గిట్టుబాటు ధర లేక పామాయిల్ రైతులు ఇక్కట్లు పాలవుతున్న సమయంలో కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా ధరను పెంచడం వల్ల రైతులు ఉపశమనం పొందారన్నారు. దేశంలో పామాయిల్ ఉత్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ వాటా 90 శాతం ఉందన్నారు. 2020 నాటికి ఆయిల్‌పామ్ 22 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్నారు. దేశంలో రెండు లక్షల హెక్టార్ల పామాయిల్ వ్యవసాయం జరుగుతోందని, ఈ పరిశ్రమలో 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని, రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.