బిజినెస్

సేవారంగ ద్రవ్యోల్బణంపై ప్రత్యేక సూచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ప్రస్తుతం ద్రవ్యోల్బణం గణాంకాలు వాస్తవ పరిస్తితిని ప్రతిబింబించడం లేదని పార్లమెంటరీ కమిటీ ఒకటి అభిప్రాయ పడుతూ వైద్య సేవలు, విద్యారంగం లాంటి వాటిలో పెరిగి పోతున్న ఖర్చులను ప్రతిబింబించేందుకు వీలుగా సేవల రంగం కోసం ప్రత్యేక ధరల సూచీని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో 60 శాతానికి సేవల రంగం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సూచీకానీ, రిటైల్ స్థాయిలో ధరల పెరుగుదల రేటును ప్రతిబింబించే వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ కానీ వాటిని పూర్తిగా ప్రతిబింబించడం లేదని కమిటీ అభిప్రాయ పడింది. సేవల రంగానికి చెందిన ధరల కదలికలను, వివిధ రంగాలకు మధ్య జరిగే వాణిజ్యాన్ని అర్థం చేసుకోవడానికి సేవల ద్రవ్యోల్బణానికి సంబణధించిన కచ్చితమైన గణాంకాలు కీలకమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక శాఖకు చెందిన పార్లమెంటు స్థారుూ సంఘం పేర్కొంది. అంతేకాకుండా ఎంటర్‌టైన్‌మెంట్, రవాణాలాంటి రంగాలు చాలా వరకు ప్రైవేటు రంగంలో ఉన్నాయని ఆ రంగాల్లో సేవల ఖర్చు టోకు ధరల సూచీ ఆధారిత లేదా రిటైల్ ద్రవ్యోల్బణంలో కనిపించే దానికన్నా చాలా ఎక్కువే ఉండవచ్చని కూడా ఆ కమిటీ అభిప్రాయ పడింది. అందువల్ల వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ఆయా రంగాలకు చెందిన రెగ్యులేటర్లకు ధరలు, ఉత్పత్తి, నాణ్యతపై మరింత మెరుగైన గణాంకాలు అవసరమని కమిటీ అభిప్రాయ పడింది. జిడిపిలో 50 శాతానికి సేవల రంగం ప్రాతినిధ్యం వహిస్తున్న దృష్ట్యా ఆయా సేవలకు సంబంధించిన ధరల కదలికలను అర్థం చేసుకోవడానికి సేవల ద్రవ్యోల్బణానికి సంబంధించి కచ్చితమైన గణాంకాలు అత్యవసరమని గత శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. అందువల్ల ‘బిజినెస్ సర్వీస్ ఇండెక్స్’ పేరుతో ఒక ప్రత్యేక సూచీని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేస్తోందని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. టోకు ధరల సూచీ పరిధిలోకి సేవల రంగం రావడం లేదు కనుకనే రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య పరపతి విధానాన్ని నిర్ణయించడానికి టోకు ధరల సూచీనుంచి రిటైల్ ద్రవ్యోల్బణానికి మారిందని కూడా కమిటీ పేర్కొంది. అయితే విద్య, వైద్య సేవలు, వినోదం, రవాణా రంగాల్లో పెరిగిపోతున్న ధరలను రిటైల్ ద్రవ్యోల్బణం సైతం పూర్తిగా ప్రతిబింబించడం లేదని కమిటీ అభిపాయ పడింది.