బిజినెస్

ఎస్‌బిఐలో బిఎమ్‌బి విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఎస్‌బిఐలో భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి) విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం అవుతున్నది తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ శాఖలు వచ్చే నెల 1 నుంచి ఎస్‌బిఐలో కలుస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే మొదటి మహిళా బ్యాంకైన బిఎమ్‌బిని కూడా ఎస్‌బిఐలో విలీనం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.