బిజినెస్

టెలికామ్ రంగంలో సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: వొడాఫోన్-ఐడియా విలీనంతో భారతీయ టెలికామ్ రంగంలో సమీకరణాలు మారిపోయాయ. బ్రిటన్‌కు చెందిన టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్.. ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ తమ విలీనాన్ని సోమవారం ప్రకటించాయ. విలీనంతో ఏర్పడే కొత్త సంస్థకు కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో వొడాఫోన్ నామినీగా ఆ సంస్థ సిఇఒ విట్టోరియో కొలావు ఉంటారు. నూతన సంస్థ బోర్డు సభ్యులుగా ఇరు సంస్థల నుంచి ముగ్గురేసి చొప్పున ప్రాతినిథ్యం వహిస్తారు. కొత్త సంస్థలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా దక్కుతుంది. ఐడియాకు 26 శాతం వాటా, మిగతాది పబ్లిక్ షేర్‌హోల్డర్లకు ఉంటుంది. మరిన్ని షేర్లను పొందడానికి ఐడియాకు హక్కు కూడా ఉంటుంది. కాగా, విడివిడిగా చూస్తే ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా టర్నోవర్ 5,025 కోట్లుగా, ఐడియా సెల్యులార్ టర్నోవర్ 36,000 కోట్ల రూపాయలుగాగా ఉంది. నిరుడు డిసెంబర్ నాటికి రెండు సంస్థల నికర రుణ భారం 1.07 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పటిదాకా కేటాయంచిన స్పెక్ట్రమ్‌లో 25 శాతానికిపైగా వొడాఫోన్-ఐడియా విలీనానంతర సంస్థదే కావడం గమనార్హం. కాగా, 2007లో భారతీయ మార్కెట్‌లోకి వొడాఫోన్ ప్రవేశించగా, హచిసన్ కొనుగోలులో 2 బిలియన్ డాలర్ల పన్ను వివాదంతో వొడాఫోన్ ఇబ్బందుల్లో పడింది. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ వొడాఫోన్ పోరాడుతూనే ఉండగా, ఈ వ్యవహారంపై ఎప్పట్నుంచో అసంతృప్తిగా ఉన్న సంస్థ.. ఈ తాజా విలీనానికి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తరలిపోతున్న విదేశీ సంస్థలు
దేశీయ టెలికామ్ రంగం నుంచి విదేశీ సంస్థలు వైదొలుగుతున్నాయా? ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాల్సి వస్తోంది. ఇటీవలికాలంలో భారతీయ టెలికామ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇలాగే ఉన్నాయి మరి. దేశీయ టెలికామ్ రంగాన్ని జియో పూర్వం.. జియో శకంగా చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన 4జి సంస్థ భారతీయ టెలికామ్ రంగాన్ని అంతలా ప్రభావితం చేసింది. దేశీయ టెలికామ్ రంగాన్ని ఏలేస్తున్న దిగ్గజాలన్నీ కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రాకతో కుదేలయ్యాయి. ఉచిత 4జి సేవలను జియో ప్రవేశపెట్టడంతో దీనికి మొబైల్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రధాన సంస్థల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ధరల యుద్ధం కారణంగా నిరుడు అక్టోబర్-డిసెంబర్‌లో ఐడియా సెల్యులార్ నష్టాల్లోకి జారుకుంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్ ఎల్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ రంగ సంస్థల పోటీకి ఎప్పుడో నష్టాల బారినపడ్డాయ. అయతే ఇప్పుడిప్పుడు డేటా ఆఫర్ల తో బిఎస్‌ఎన్‌ఎల్ దూకుడును ప్రదర్శిస్తుండగా, ల్యాండ్‌లైన్ కస్టమర్లు ఈ సంస్థకు పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. అయనప్పటికీ నష్టాలు వెంటాడు తూనే ఉన్నాయ. ఈ క్రమంలో అప్పటిదాకా సహచర సంస్థలు, ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న విదేశీ టెలికామ్ సంస్థలు.. భారతీయ టెలికామ్ రంగం నుంచి నిష్క్రమించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చేశాయి. జియో దూకుడును తట్టుకోలేమని భావించిన వారంతా కూడా ఇతర సంస్థల్లో విలీనానికి సిద్ధపడుతున్నాయి. ఐడియాలో వొడాఫోన్ విలీనమైనా, ఎయిర్‌టెల్‌తో టెలినార్ ఒప్పందమైనా, టాటా కమ్యూనికేషన్స్‌తో జపాన్‌కు చెందిన డొకొమో విడిపోదామన్నా.. ఇప్పుడు ఏ వ్యవహారం చూసినా అవగతమయ్యేది భారత్‌కు విదేశీ టెలికామ్ సంస్థలు దూరమవ్వాలనో, సొంతంగా భారత్‌లో మనగలలేమనో అనేదే. స్పెక్ట్రమ్ ధరలు కూడా భారంగా మారిపోతున్నాయ. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని టెలికామ్ ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల క్రమంలోనే బ్రిటన్ టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్.. భారత్‌లోని తమ వ్యాపారాన్ని ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్‌లో విలీనం చేస్తోంది.
ఎయిర్‌టెల్‌కు రెండో స్థానమే
మొత్తం షేర్ లావాదేవీల్లో జరిగే ఈ డీల్‌తో దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థగా వొడాఫోన్-ఐడియా విలీనానంతర సంస్థ అవతరించనుంది. భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానానికి పరిమితమయ్యే వీలుండగా, జియో ఇన్ఫోకామ్‌కూ గట్టి పోటీనిచ్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నాయి వొడాఫోన్, ఐడియా. కాగా, ప్రస్తుతం భారతీయ టెలికామ్ మార్కెట్‌లో వొడాఫోన్ రెండో అతిపెద్ద సంస్థగా ఉంది. ఐడియా సెల్యులార్ మూడో అతిపెద్ద సంస్థగా ఉంది. అయతే ఈ రెండు సంస్థలు ఏకమైతే ఏర్పడే సంస్థ మొదటి స్థానాన్ని ఆక్రమించనుంది. దీంతో ఇప్పుడు ప్రథమ స్థానంలో కొనసాగుతున్న భారతీ ఎయర్‌టెల్ కాస్తా రెండో స్థానానికి పరిమితం కానుంది.
వొడాఫోన్-ఐడియా విలీనానంతర సంస్థ వినియోగదారుల సంఖ్య దాదాపు 39 కోట్లకు చేరుతుంది. ఎయర్‌టెల్ కస్టమర్లు 27 కోట్లుగా ఉంటే, జియో వినియోగదారులు 7.2 కోట్లుగా ఉన్నారు. మార్కెట్‌లో వొడాఫోన్-ఐడియా విలీనంతో వచ్చే సంస్థ విలువే సుమారు 40 శాతంగా ఉంటుందని అంచనా. ఎయర్‌టెల్ వాటా రమారమి 32 శాతమని మార్కెట్ విశే్లషకులు పేర్కొంటున్నారు. విలీనంతో వచ్చే సంస్థ రెవెన్యూ 80,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.
ఉద్యోగాల కోతకు ఆస్కారం?
మరోవైపు విలీనంతో ఉద్యోగాలు పోయే వీలుందని కూడా తెలుస్తోంది. వొడాఫోన్ సిఇఒ విట్టోరియో కొలావు మాట్లాడుతూ ఈ విలీనంతో మరిన్ని ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని అంటున్నా.. కుమార మంగళం బిర్లా మాత్రం విలీనానంతర సంస్థ పరిమాణాన్ని తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విలీనంతో సేవల నాణ్యత పెరుగుతుందని ఇరు సంస్థలు చెబుతున్నాయి. కాగా, ఈ విలీనంతో దేశీయ టెలికామ్ పరిశ్రమలో పోటీ తగ్గుముఖం పట్టవచ్చని, సంస్థల సంఖ్య తగ్గినకొద్దీ ఆదాయం పెరిగే వీలుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాహసోపేత నిర్ణయం: సిఒఎఐ
వొడాఫోన్-ఐడియా విలీనాన్ని సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించింది సెల్యులార్ సంఘం సిఒఎఐ. దీనివల్ల ఇటు ప్రభుత్వం, అటు మొబైల్ వినియోగదారులకు లాభం చేకూరగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విలీనానికి రెగ్యులేటర్ల నుంచి త్వరతగతిన ఆమోదముద్ర లభించగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా సోమవారం సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పిటిఐతో వెలిబుచ్చారు. దేశంలో సులభతర వ్యాపార నిర్వహణార్థం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన కనబరిచారు. వొడాఫోన్ ఇండియా, వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌తో విలీనానికి ఐడియా సెల్యులార్ బోర్డు సోమవారం ఆమోదం తెలిపినది తెలిసిందే.
సోమవారం ముంబయలో విలీన ప్రకటన సందర్భంగా ముచ్చటించుకుంటున్న కుమార మంగళం బిర్లా, విట్టోరియో కొలావు