బిజినెస్

మూడేళ్లలో ఐటి రంగంలో మేటిగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: వచ్చే మూడేళ్లలో ప్రపంచ స్ధాయిలో హైదరాబాద్ ఐటి రంగం అగ్రగామిగా ఎదుగుతుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్ధానంలో ఉందన్నారు. నిరుడు రూ. 67 వేల కోట్ల విలువ చేసే ఐటి ఎగుమతులు చేసిందన్నారు. శుక్రవారం ఇక్కడ అసోచామ్ సంస్థ తెలంగాణ లో వాణిజ్యం అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం నూతన ఐటి, స్టార్టప్ విధానాలను రూపొందించి అమలు చేస్తోందని, అంతర్జాతీయంగా మంచి స్పందన లభిస్తోందన్నారు. హైదరాబాద్‌లో సమాచార టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతానికి (ఐటిఐఆర్)కు కేం ద్రం పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్రప్రభుత్వం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి అవరోధాలు లేకుండా ఏకగవాక్ష పథకం కింద పరిశ్రమల స్ధాపనకు అవసరమైన అనుమతులు ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్ట్ఫికేషన్ సిస్టమ్(టిఐపాస్)కు విశేష స్పందన లభిస్తోందన్నారు. పరిశ్రమల ప్రణాళికలకు ఆమోదం, క్లియరెన్సు లు, అనుమతులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించేందుకు టిఐపాస్ ఉపకరిస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని, కొత్త రాష్ట్రం తెలంగాణలో వౌలిక సదుపాయాలు, విద్యు త్, రవాణా సదుపాయాలు అద్భుతం గా ఉన్నాయన్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో ఫార్మాలో తెలంగాణ నెంబర్ వన్‌కు వెళ్తుందన్నారు. సమావేశానికి ఐటి, ఫార్మా రంగానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.