బిజినెస్

పెట్టుబడులకు విస్తృత అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 22: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక శక్తి శాఖల మంత్రి పియూష్ గోయల్.. పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థల అధిపతులను, వివిధ శాఖల ప్రతినిధులను కలిశారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలియజేసింది. బ్లాక్‌స్టోన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ, చైర్మన్ స్టీఫెన్ షవర్జియాన్, వార్‌బర్గ్ పింకూస్ ప్రతినిధి సౌరభ్ అగర్వాల్‌తోపాటు న్యూయార్క్ గ్రీన్ బ్యాంక్ అధ్యక్షుడు ఆల్‌ఫ్రెడ్ గ్రిఫ్ఫిన్, న్యూయార్క్ గవర్నర్ కార్యాలయంలో ఎనర్జీ, ఫైనాన్స్ విభాగం చైర్మన్ రిచర్డ్ కౌఫ్‌మన్, బిగ్ బెల్లి సిఇఒ జాక్ కుట్నర్‌లతో గోయల్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యాపారానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని రకాల చర్యలను వారికి వివరించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను సైతం విశదీకరించారు. ప్రస్తుత భారత వృద్ధిరేటును ఇలాగే నిలకడగా ఉండేందుకు కావాల్సిన చర్యలనూ తమ ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు మంచి భవిష్యత్తు ఉందని, డెమొక్రసీ, డెమోగ్రఫీ, డిమాండ్‌ల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన గోయల్.. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండంకెల వృద్ధిరేటును కూడా నమోదు చేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్, పునరుత్పాదక శక్తి తదితర రంగాల్లో పెట్టుబడులకు సరళతరమైన ప్రవేశాన్ని కల్పిస్తున్నామని వ్యాపార, పారిశ్రామికవేత్తలకు, మదుపరులకు గోయల్ వివరించారు. గ్రీన్ గ్రిడ్, జాతీయ సోలార్ మిషన్, ఎల్‌ఇడి బల్బుల వినియోగం, విద్యుత్ ఆదాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలనూ తెలిపారు. ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన తదితర పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కాగా, ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం అంతర్జాతీయ సౌర కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలలో పియూష్ గోయల్ కూడా పాల్గొంటున్నారు.

chitram న్యూయార్క్ లో బ్లాక్‌స్టోన్ చైర్మన్, సిఇఒ స్టీఫెన్ షవర్జియాన్ తో గోయల్