బిజినెస్

పాకాల చెరువు పర్యాటక అభివృద్ధికి రూ. 1.50 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: వరంగల్ గ్రామీణ జిల్లా పాకాల చెరువు పర్యావరణ ప్రాజెక్టు అభివృద్ధికి 1.50 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. 12 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును సంరక్షించి పర్యావరణ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత రెస్టారెంట్‌లో వసతులను పెంచడం, కాటేజీల ఏర్పాటు, టిక్కెట్ కౌంటర్లు, బోటింగ్ స్టెప్స్ ఆధునీకరించడం తదితర సౌకర్యాలను ఈ నిధులతో సమకూర్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.