బిజినెస్

దుమ్మురేపిన రిలయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి- మార్చిలో దుమ్మురేపే లాభాలను ప్రకటించింది. ఎనిమిదేళ్లకుపైగా కాలంలో ఎన్నడూలేనంత స్థాయిలో లాభాలను పొందింది. నిరుడుతో పోల్చితే 16 శాతం వృద్ధిచెంది 7,398 కోట్ల రూపాయల లాభాలను అందుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 2007-08 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన 8,079 కోట్ల రూపాయల లాభం తర్వాత మళ్లీ ఇదే. ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014- 15) ఇదే సమయంలో 6,381 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. స్టాండలోన్ ఆధారంగా ఈసారి 7,320 కోట్ల రూపాయల లాభాన్ని పొందగా, నిరుడు కంటే ఇది 17.25 శాతం అధికం. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ నికర లాభం రికార్డు స్థాయిలో 27,630 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇది 23,566 కోట్ల రూపాయలుగానే ఉం ది. అయితే టర్నోవర్ మాత్రం 23.8 శాతం పడిపోయి 2,96,091 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రిలయన్స్ మూలధన వ్యయం నిరుడుతో పోల్చితే 30,000 కోట్ల రూపాయలు పెరిగింది. పోయినసారి 1.20 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, ఈసారి 1.50 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ పెట్టుబడుల్లో అత్యధికం తమ టెలికామ్ విభాగం రిలయన్స్ జియోకే ఆర్‌ఐఎల్ కేటాయించింది. 60,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెట్టనుంది. మరో 50-60,000 కోట్ల రూపాయలను జమ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ విస్తరణకు వెచ్చించనున్నట్లు చెప్పింది. రిలయన్స్ రిటైల్‌కూ 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులను కేటాయించింది. అమెరికా షేల్ గ్యాస్ కార్యకలాపా లకు వెయ్య కోట్లిచ్చింది.
పెరిగిన రిలయన్స్ రిటైల్ లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ ప్రీ-ట్యాక్స్ లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 17.5 శాతం పెరిగి 235 కోట్ల రూపాయలుగా నమోదైంది. క్రిందటిసారి 200 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 5,781 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,788 కోట్ల రూపాయలుగా ఉంది.