బిజినెస్

స్కూటర్ అమ్మకాల్లో హీరోను దాటేసిన టివిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటార్ కో.. దేశీయ ఆటోరంగ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ను స్కూటర్ల అమ్మకాల్లో వెనక్కి నెట్టేసింది. ఆటోరంగ సమాజం సియామ్ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-్ఫబ్రవరి వ్యవధిలో దేశీయంగా టివిఎస్ స్కూటర్ అమ్మకాలు 7,43,838 యూనిట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-్ఫబ్రవరిలో ఇవి 7,07,884 యూనిట్లుగా ఉన్నాయి. 5.07 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో హీరో మోటోకార్ప్ స్కూటర్ విక్రయాలు 7,31,967 యూనిట్ల నుంచి 7,19,987 యూనిట్లకు పడిపోయాయి. 1.64 శాతం క్షీణత చవిచూసింది. ఇక ప్రథమ స్థానంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) నిలిచింది. 15.32 శాతం వృద్ధితో గతంతో పోల్చితే 25,44,872 యూనిట్ల నుంచి 29,34,794 యూనిట్లకు పెరిగాయి. కాగా, గత నెల ఫిబ్రవరిలో హోండా యాక్టీవా అమ్మకాలు అధికంగా జరిగాయి. 2,17,098 యూనిట్లుగా నమోదయ్యాయి. తర్వాత టివిఎస్ జుపిటర్ 51,817 యూనిట్లుగా ఉంటే, హీరో మ్యాస్ట్రో 32,421 యూనిట్లుగా ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో యమహా, సుజుకి వాహనాలుండగా, యమహా మోటార్ అమ్మకాలు నిరుడుతో పోల్చితే 37.43 శాతం పెరిగి 2,87,921 యూనిట్ల నుంచి 3,95,704 యూనిట్లకు చేరాయి. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాలు కూడా 2,05,680 యూనిట్ల నుంచి 2,51,504 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక మొత్తం నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిదాకా దేశీయంగా జరిగిన స్కూటర్ అమ్మకాలు 51,17,997 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్-్ఫబ్రవరిలో ఇవి 45,81,640 యూనిట్లుగా ఉన్నాయి.